పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు

పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు

అందోల్,: సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు కోరుతూ సంగారెడ్డి డిఎం హెచ్ ఓ కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రo ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా అవమానించారంటూ కాంగ్రెస్ నాయకులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్ 22వ తేదీన నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వలేదని స్థానిక కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలోని మిగతా అన్ని వార్డుల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి,ఉద్దేశపూర్వకంగానే నాలుగు వార్డుల ప్రజాప్రతినిధులను విస్మరించారని వారు మండిపడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డితో పాటు 12వ వార్డు కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి-పోచయ్య,17వ వార్డు కౌన్సిలర్ మేఘరాణి-సైలాన్, అలాగే 19వ వార్డు కౌన్సిలర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డి సైలాన్.ప్రోటోకాల్ ఉల్లంఘించిన డాక్టర్ శంకర్ నాయక్ చౌహాన్,12వ వార్డు ఆశా వర్కర్ మాణెమ్మతో పాటు 20, 12, 17 వార్డుల మెడికల్ సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి డిఎం హెచ్ ఓ కు వినతిపత్రం సమర్పించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
అందోల్,: సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు కోరుతూ సంగారెడ్డి డిఎం హెచ్ ఓ కు కాంగ్రెస్...
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
ఎన్‌హెచ్‌ఎం పోస్టుల ప్రొవిజనల్ జాబితా విడుదల