మండల పార్టీ నూతన కమిటీ ఖరారు
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుళ్లాలి - పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
రాయపర్తి : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాయపర్తి మండలంలో నూతన కమిటీ ఖరారైంది.గురువారం సాయంత్రం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయపర్తి మండల పార్టీ నూతన కమిటీని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.పార్టీ నూతన బాధ్యతలను చేపట్టిన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కొత్త సారధులు కీలక పాత్ర పోషిస్తారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
* నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు వీరే..
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు గిరగాని రాజు,మచ్చ నీలయ్య,గారె చిన్న సాయిలు,బీసీ సెల్ అధ్యక్షుడు చెవ్వు కాశీనాథం,ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందికట్ల యాకయ్య,మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి అప్రోజ్,కిసాన్ సెల్ అధ్యక్షుడు ఖమ్మం సోమన్న,ఎస్టీసెల్ అధ్యక్షుడు మూనావత్ కిషన్ నాయక్,మండల మహిళా అధ్యక్షురాలు కౌడగాని ఉమా,మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు కుందూరు జైపాల్ రెడ్డి,జక్కుల సారగం,సన్నూరి మహిబా,గుగులోత్ యాకుబ్,కార్యదర్శులు మద్దెల వెంకటేష్,ఎం సరిత,ఎండీ.అబ్దుల్,పాశం నరోత్తం రెడ్డి,మంద యాకన్న,చిన్నపాక వెంకటస్వామి,కార్యవర్గ సభ్యులుగా కేసని వెంకట్ రెడ్డి,చిలువేరు స్వరూప,బద్దం గంగ లక్ష్మి,ఎండి మొహీనుద్దీన్,అబ్బరబోయిన సారంగం,మూనావత్ సీతారాం,గౌరారపు దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కష్ట కాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు.క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని,ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.రాయపర్తి మండల సమగ్రాభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు,ప్రతినిధులు,వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


