షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
ప్రజావాణి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు
బెల్లంపల్లి (మంచిర్యాలజిల్లా:) బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ బస్తీ స్మశాన వాటికలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డు తొలగించారు. స్మశాన వాటికలో అక్రమంగా షెడ్డు నిర్మించడంపై బస్తీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బెల్లంపల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ఈ మేరకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, స్మశాన వాటికలో నిర్మించిన అక్రమ రేకుల షెడ్డు నిర్మాణాన్ని తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టే ముందు తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి, నిబంధనల ప్రకారం భవన నిర్మాణ అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


