పశు సంపదను పెంచాలి
ఎల్ నీ నో ప్రకృతి వైపరీత్యం , సింగూరు నీరు మెదక్ జిల్లాకే
---కార్మిక ,గనుల భూగర్భ, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్ : పశు సంపదను పెంచాలని, ఎల్ నీ నో ఒక ప్రకృతి వైపరీత్యము అని, సింగూరు జలాలు మెదక్ జిల్లా వాసుల అవసరాలకు వినియోగిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు.
సోమవారం, నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు చికిత్స
అవగాహన కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి లతో కలసి పాల్గొన్నారు.
పశువులకు , గొర్రెలకు గాలి కుంట వ్యాధి నివారణ, నట్టల వ్యాధి నివారణ మందులను వేశారు.
జిల్లాలో పశువులకు, గొర్రెలకు, మేకలకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి పశువైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గొర్రెల కాపరులు మంత్రికి గొర్రె బహుకరించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకట స్వామి మాట్లాడుతూ.. జిల్లాలో పశుసంపద పెంచి రైతులు అదనపు ఉపాధి మార్గాలను ఏర్పరచుకోవాలన్నారు.
ఎల్ నీ నో ఒక ప్రకృతి వైపరీత్యము అని, దానిని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు.
రైతులందరూ వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని తెలిపారు.
భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రాబోయే రోజుల్లో త్రాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల బోర్‌వెల్స్ ఉన్నాయని, అక్టోబర్ నెలలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించామన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయకపోతే పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
ఎల్ నీ నో ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని పార్టీల తో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి సహాయం చేయమని అడుగుతామన్నారు.
గతంలో తన తండ్రి కాకా వెంకటస్వామి సాగునీటి కోసం చాలా ప్రయత్నించాలని గుర్తు చేశారు.
మెదక్ ఎంపీ రఘు నందన్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పశు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గ్రామాల్లో పశుసంపదను పెంచేందుకు , గాలి కుంట నివారణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఆయిల్ ఫాం సాగు చాలా తక్కువగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు కోసం అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు వివరించారు.
జిల్లాలో ఉన్న సింగూరు నీటిని మెదక్ జిల్లాకు మాత్రమే ఉపయోగించాలన్నారు.
హైదరాబాద్ నగరానికి నాలుగు మార్గాలు అయిన ఎల్లంపల్లి ,గోదావరి, నాగార్జునసాగర్, హిమాయత్ సాగర్ నుంచి త్రాగునీటి అవసరాలు తీర్చే అవకాశాలు ఉన్నాయని, మెదక్ మాత్రం సింగూరు ఒక్కటే ఉన్నదని అన్నారు.
మెదక్ జిల్లా ప్రజలకు మంచినీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పశు సంపద పెరగాలంటే, పశుసంతోనో ఉత్పత్తి పెంచాలన్నారు.
పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వివరించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
పశుసంవర్ధ శాఖలో సిబ్బంది కొరత తీర్చాలన్నారు.
సింగూరు నీటిని పరిశ్రమలకు వినియోగించకుండా జిల్లా ప్రజల అవసరాల కోసం వినియోగించాలన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..ఎల్ నీ నో పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నీటిని సంరక్షించాలన్నారు.
జిల్లాలో ఎల్ నీ నో లో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయాల చైర్మన్ సుహాసిని రెడ్డి, సర్పంచ్ గీతా నరేందర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆదిత్య వర్మ, ఉప సర్పంచ్ నవీన్, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


