గజ్వేల్ లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధ అవగాహన కార్యక్రమం

గజ్వేల్ లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధ అవగాహన కార్యక్రమం

గజ్వేల్/సిద్దిపేట జిల్లా : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో, సెంట్ మేరీస్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన "సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధ అవగాహన కార్యక్రమం" ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ జీవితంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలందరూ పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ సంచులకు బదులుగా పర్యావరణహితమైన వస్త్ర సంచులు, జూట్ బ్యాగులు వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించేలా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ రాయబారు లుగా మారి తమ ఇళ్లలో, పరిసరాల్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం ఏర్పడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు మరియు వాయు కాలుష్యం ఎలా జరుగుతుందో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సమగ్రంగా వివరించారు. పరిశుభ్రమైన, ప్లాస్టిక్ రహిత మోడల్ మున్సిపాలిటీగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ను తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సెంట్ మేరీస్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి