ఎన్ఐఎన్ కాలనీలో వైభవంగా దుర్గామాత ప్రతిష్ట...

WhatsApp Image 2026-10-11 at 5.48.30 AM

బోడుప్పల్  (మేడ్చల్)  : దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మేడిపల్లి పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాలనీలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మూడో సంవత్సరం అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రాలు, పూజా కార్యక్రమాల నడుమ అమ్మవారిని ప్రతిష్టించడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారికి పూజలు, హారతులు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు భక్తులకు అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గంగపుత్ర సంఘం ప్రతినిధులు వెల్లడించారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

 

 

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..