జాతీయ స్థాయి ఎస్ జిఎఫ్ ఉషు క్రీడా పోటీలకు జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాల విద్యార్థి ఎంపిక

గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల) : గంభీరావుపేట మండల చెందిన కొత్తపల్లి గ్రామా జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల క్రీడాకారుడు బి. సాయి క్రిష్ణ ఎస్ జి ఎఫ్ జాతీయ స్థాయి ఉషు క్రీడా పోటీలకు ఎంపిక అయ్యాడు అని పి ఈ టి బాను తెలిపారు. గత నెల 27 న ఉమ్మడి కరీంనగర్ లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో బంగారు పథకం సాధించి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యాడు. అదే నెలలో 28, 29 జి హెచ్ ఎమ్ సి రెడ్ హిల్స్ నాంపల్లి క్రీడా మైదానం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో వెండి పథకం సాధించాడు. ఈ నెల 14 నుండి 18 వరకు జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొననున్న సాయి క్రిష్ణ ని డి వై ఎస్ ఒ అజ్మీరా రాందాస్, పాఠశాల హెచ్ ఎమ్ నారాయణ, పి ఈ టి బాను, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రవీందర్, ఉమ్మడి జిల్లా ఉషు కార్యదర్శి విద్య సాగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మరియు సైమా అకాడమీ కోచ్ విక్రం, ఎమ్ ఈ ఒ గంగారాం, సమ్మర్ క్యాంప్ ఫౌండర్ చేరాలా లహరిక -నిఖిల్ గౌడ్, కొత్తపల్లి గ్రామా సర్పంచ్ నాగపురి బాలరాజ్ గౌడ్, ఉప సర్పంచ్, మండల పి ఈ టి ల బృందం, పాఠశాల ఉపాధ్యాయినిఉపాధ్యాయులు, మరియు గ్రామస్తులుఅభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


