నాగర్ కర్నూల్‌లో స్టేడియం స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి.

కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో 10 ఎకరాల స్థలం పరిశీలన - త్వరలోనే స్టేడియం నిర్మాణానికి చర్యలు

నాగర్ కర్నూల్‌లో స్టేడియం స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి.

నాగర్ కర్నూల్ పట్టణంలో క్రీడాకారుల చిరకాల కోరిక అయిన స్టేడియం నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శనివారం సంయుక్తంగా పరిశీలించారు. పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయం వెనుక భాగంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ స్థలం స్టేడియం నిర్మాణానికి అనుకూలంగా ఉందా, చుట్టూ ఉన్న వసతులు, రోడ్డు సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువతకు, క్రీడాకారులకు సరైన క్రీడా మైదానం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.నాగర్ కర్నూల్ పట్టణంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కేటాయించిన ఈ స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు! అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు!
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, హామీలను వెంటనే అమలు చేయాలహుస్నాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడం శోచనీయమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి చెందిన ఉద్యమకారులు తెలిపారు....
హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.