తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులను చేయడం సరైనది కాదు అని సోమవారం ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి టి యు ఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త. బాన్స్ వాడ తెలంగాణ ఉద్యమకారుల కు కాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్న ఇది వరకు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ సోమవారం నాడు సీఎం ఇంటి ముట్టడికి పిలుపుఇచ్చిన నేపథ్యం లో హైదరాబాద్ బయలుదేరిన పట్టణానికి చెందిన ఉద్యమకారుల ను ఈ రోజు తెల్లవారుజామున అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోని వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త మాట్లాడుతు. ప్రభుత్వం ఉద్యమకారుల కొరకు కే.కే కమిటీ అని గత 5 నెలల క్రితం ఏర్పాటు చేసిన అట్టి కమిటీ కేవలం కాలయాపన మాత్రమే చేస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇకనైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అక్టోబర్ నెల లోపు ఆన్లైన్ ప్రక్రియ ను ప్రారంభం చేయాలి ఒక వేళ ఆన్లైన్ ప్రక్రియ ను నీరుకారుస్తే నవంబర్ నెల లో కచ్చితంగా సీ.ఎం ఇల్లు ముట్టడి చేస్తాం ఇకనైనా గత బి ఆర్ ఎస్ పార్టీ కి గద్దె దించామో అదే గతి కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఈ అరెస్ట్ లో బాన్సువాడ మండల అధ్యక్షులు కాల్వ శ్యామ్, ప్రధాన కార్యదర్శి దమ్మణపేట భాస్కర్ గౌడ్, ఎద్దుబల్లె కృష్ణ, అగ్లవే దత్తు, గైని గంగారామ్, పల్లికొండ సాయిలు, బుర్రిగారి మహేష్, పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


