పటేల్ గూడెంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

WhatsApp Image 2026-10-10 at 7.21.26 AM

రైతులకు మద్దతుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు (శివకుమార్)

లింగాలఘణపురం (జనగామ) : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు (శివకుమార్) ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం ద్వారా సేవలు అందించేందుకు సంబంధిత అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడీ నూరుద్దీన్, తహశీల్దార్ అండాలు, ఏపీఎం జ్యోతి, సర్పంచ్ పొన్నాల బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ శోభన్ బాబు, సీసీ యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్ మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి కరుణాకర్, మాజీ సర్పంచులు శేఖర్ రెడ్డి, సోమిరెడ్డి, యువ నాయకులు ఎర్ర క్రాంతి, హమాలీ సంఘం నాయకులు, రైతులు, యువకులు, ఐకేపీ కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

 

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.