శ్రీ సాయి స్కూల్ లో జల ప్రతిజ్ఞ
నారాయణపేట : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోవడం వలన నీటి సమస్యలు తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది కావున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని శ్రీ సాయి స్కూల్ విద్యార్థులు ,ఉపాధ్యాయ బృందం ప్రార్థన సమయంలో జల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సాయిలీల, ప్రిన్సిపాల్ వసంత రావు మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకొని రాబోయే తరాల వారికి నీటి ఇబ్బంది రాకుండా చూసుకొనే బాధ్యత అందరిపై ఉంది అని అన్నారు.వర్షపు నీటిని కాపాడుకోవడం కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపారు.నీటి సమస్యను ఎదుర్కొనడం కోసం మిత్రులకు, కుటుంబ సభ్యులకు మరియు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదుర్కొనే విధంగా చైతన్యం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీనా, బాలప్ప, హెచ్. నర్సింహా,సురేష్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

