మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం

రూ.3 కోట్ల వ్యయంతో గొంగ్లూర్ తాండా నుంచి ఉప్పరి గూడెం వరకు 2.6 కిలోమీటర్ల రహదారి నిర్మాణం

మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం

చౌటకూర్ నవంబర్ 11 (విజన్ ఆంధ్ర) చౌటకూర్ మండలం పరిధిలోని గిరిజన గ్రామాల రహదారి సమస్యకు పరిష్కారం చూపే దిశగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన చొరవతో రూ.3 కోట్ల నిధులతో గొంగ్లూర్ తాండా నుంచి ఉప్పరి గూడెం వరకు 2.6 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.ఎన్నో ఏళ్లుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంత ప్రజలకు నూతన రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ కష్టాలు తగ్గనున్నాయి. ప్రస్తుతం రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ రహదారిని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ రహదారి అందుబాటులోకి వస్తే గొంగ్లూర్ తాండా, ఉప్పరి గూడెం గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక మల్హర్‌రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం ఎస్ ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
మల్హర్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి కేసారపు నరేష్, ఎమ్మార్పీఎస్ మల్హర్ మండల అధ్యక్షుడు ఇందారపు...
15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వెటర్నరీ వైద్య శిబిరం
ఘనంగా మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత - ఆదిలాబాద్ లో ఘనంగా పెన్షన్ల పంపిణీ.
డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
కంజర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.