తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, : లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన తండ రమేష్, తండ యాదగిరి, తండ శ్రీనివాస్ తల్లి తండ రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తండ రమేష్ క్రియాశీలకంగా పనిచేశారని, తల్లి మరణం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో బీఆర్ఎస్ నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, మల్క రమేష్, మస్రుగని వినయ్ కుమార్, ఎర్రబెల్లి గోపాలరావు, అల్మియా అబ్బా, గోపాల్ రెడ్డి, ఆషాడపు దేవేందర్, అంతటి రాము, చంటి భద్రయ్య, జనగం రవీందర్, తండ నగేష్, చంద్రగిరి రాజయ్య, ముడిగే రాజకుమార్, వలి బాబా, గట్టు కుమార్, గట్టు శ్రీనివాస్, అంతగిరి రాజు, చిన్న విజయ్, కోకిల మహేష్, సర్పంచ్ గుండ్ల సరిత, రమేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


