ఘనంగా బాలల హక్కుల దినోత్సవ వేడుకలు
ఆగాపే చిల్డ్రన్స్ హోమ్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం బాలల హక్కులపై పిల్లలకు అవగాహన కల్పించాలి ఘట్కేసర్ డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్.
ఘట్కేసర్, : జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచారంలోని అగాపే చిల్డ్రన్ హోమ్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, బాలల హక్కులు, విద్యా హక్కు, రక్షణ, ఆరోగ్యం, పోషకాహారం మరియు బాలల సంక్షేమంపై పిల్లలకు అవగాహన కల్పించారు. ప్రతి బాలుడు తన హక్కులను తెలుసుకోవడంతో పాటు విద్యను అభ్యసించి, ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగేశ్వరరావు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, బాలలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వివక్ష, బాల కార్మికత్వం, బాల్యవివాహాలు మరియు బాలలపై జరిగే హింసకు గురికాకుండా రక్షణ పొందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బాలికల పర్యవేక్షణ అధికారి భవాని మాట్లాడుతూ, బాల్యవివాహాలు, బాల కార్మికత్వం మరియు బాలలపై జరిగే హింసను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, బాలల భద్రత మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటపాటలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ రంగారెడ్డి, ఏ హెచ్ టి యు. ఎస్‌ఐ ఖలీల్ అలీ, మెడికల్ ఆఫీసర్ భాగ్యశ్రీ, అగాపే హోమ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, సాధన సంస్థ ప్రతినిధులు, అగాపే హోమ్ సిబ్బంది, ప్రభుత్వ బాలల సంరక్షణ గృహాల సిబ్బంది మరియు బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


