ఇంటర్ జోనల్ టీ20లో మెదక్ పోలీసుల సత్తా

ఫైనల్లో సిరిసిల్లపై 56 పరుగుల తేడాతో ఘన విజయం

ఇంటర్ జోనల్ టీ20లో మెదక్ పోలీసుల సత్తా

విజేత జట్టును ఘనంగా సన్మానించిన ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ 
మెదక్,కరీంనగర్‌లో జరిగిన ఇంటర్ జోనల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో మెదక్ జిల్లా పోలీస్ జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో సిరిసిల్ల పోలీస్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేత జట్టును శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ టోర్నమెంట్‌లో మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల పోలీస్ జట్లు పాల్గొన్నాయి. తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన మెదక్ జట్టు సమష్టి కృషి, అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో సిరిసిల్ల జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
టోర్నమెంట్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 295 పరుగులు సాధించిన సాయి లాటి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డును దక్కించుకున్నారు. జట్టును సమర్థవంతంగా నడిపించి విజయానికి కీలక పాత్ర పోషించిన కెప్టెన్ తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్‌ను, అద్భుత బ్యాటింగ్‌తో రాణించిన సాయి లాటిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జట్టు సభ్యులందరినీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.క్రీడలు పోలీసుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, సమష్టి కృషి స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించి మెదక్ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, సీఐలు మహేష్, వేంకట రాజా గౌడ్, సిబ్బంది, పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో  రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
మక్తల్ :  తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈ...
నవంబర్ 5నుండి కేంద్రమంత్రి బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
వట్టెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన సర్పంచ్ జ్యోతి శంకర్ మరియు బీజేపీ మండల నాయకులు
టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి