20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్:

యశోదా వైద్యుల అధునాతన చికిత్సతో నిలిచిన ప్రాణం. కుడి చెయ్యి,కాలు చచ్చుబడటం,మాట కోల్పోవడంతో ఆస్పత్రికి. బ్రెయిన్ లో 5 మి.మీ మిడ్ లైన్ షిఫ్ట్,తీవ్ర పొటాషియం లోపంతో సంక్లిష్ట పరిస్థితి.

20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్:

ఉమ్మడి నల్లగొండ బ్యూరో : అకస్మాత్తుగా మాట కోల్పోవడం,కుడిచెయ్యి, కుడికాలు కదలకపోవడం వంటి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన 20 ఏళ్ల యువతికి హైదరాబాద్ మలక్ పేట్ లోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అధునాతన చికిత్స అందించి ప్రాణాపాయం నుండి కాపాడారు.బ్రెయిన్ స్కానింగ్ లో ఎడమ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ (ఏసిఎ) పరిధిలో అక్యూట్ ఇస్కీమిక్ స్ట్రోక్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.ఎడమ పారాసాజిటల్ ఫ్రంటోపారియటల్ ప్రాంతంలో ఇన్ ఫార్క్ట్ ఏర్పడి,మాస్ ఎఫెక్ట్ కారణంగా మెదడు మధ్యరేఖ కుడివైపునకు 5 మిల్లీమీటర్లు మారినట్లు గుర్తించారు.ప్రారంభ పరీక్షల్లో యువతి కుడిచెయ్యి, కుడికాలు కండరాల శక్తి 0/5 గా నమోదైంది.అఫేసియా కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో న్యూరో ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు.
న్యూరోసర్జన్ పరీక్షల అనంతరం బ్రెయిన్ సర్జరీ అవసరం లేకుండా కన్జర్వేటివ్ మెడికల్ మేనేజ్ మెంట్ కొనసాగించారు.అదే సమయంలో రక్తంలోని పొటాషియం స్థాయి లీటరుకు 1.8 మిల్లీమోల్స్ కు పడిపోవడం,నియంత్రణకు కష్టమైన అధిక రక్తపోటు, సోడియం స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. దీంతో న్యూరాలజీ,క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ,ఎండోక్రైనాలజీ సహా వివిధ విభాగాల నిపుణులు సమన్వయంతో చికిత్స అందించారు.హార్మోన్ల సంబంధిత సమస్య ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.అయితే కంజెనిటల్ అడ్రినల్ హైపర్ ప్లాసియా,17-ఆల్ఫా హైడ్రాక్సిలేస్ డెఫిషియెన్సీ నిర్ధారణ కాలేదు.చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇతర అంతర్లీన ఆరోగ్య సమస్యలను కూడా సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని,ఈ యువతికి తీవ్రమైన స్ట్రోక్ తో పాటు రక్తపోటు,ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉండటంతో నిపుణుల సమన్వయంతో చికిత్స అందించినట్లు కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ డా.సూరిశెట్టి భరత్ కుమార్ తెలిపారు.ఇటువంటి క్లిష్టతరమైన కేసుల్లో అనుమానిత హార్మోన్ల సమస్యపై మరిన్ని పరీక్షలు అవసరమని కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డా. జయాదిత్య ఘోష్ పేర్కొన్నారు.బ్రెయిన్ స్కానింగ్ ఫలితాలను పరిశీలించి కన్జర్వేటివ్ మెడికల్ మేనేజ్ మెంట్ సూచించినట్లు సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డా.బి. గేయానంద్ సుధీర్ తెలిపారు.
చికిత్స అనంతరం యువతి ఆరోగ్య పరిస్థితిలో సంతృప్తికరమైన మెరుగుదల కనిపించడంతో హీమోడైనమికల్ గా స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జి చేశారు. తదుపరి న్యూరలాజికల్ ఫాలోఅప్ అవసరమని వైద్యులు సూచించారు.
వివిధ విభాగాల వైద్య నిపుణుల సమన్వయంతో సంక్లిష్టమైన కేసులకు సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు యశోదా ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. అకస్మాత్తుగా శరీరంలో ఒకవైపు బలహీనత,మాట రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా వెంటనే అత్యవసర వైద్య సేవలు పొందాలని సూచించారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి -- పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన  -- సీఐ శ్రీనివాస్ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి -- పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన -- సీఐ శ్రీనివాస్
స్టేషన్ ఘన్‌పూర్ : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘన్‌పూర్ సీఐ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఘన్‌పూర్...
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బాలల హక్కులు రక్షణ చుట్టాల పై అవగాహన కల్పించిన సివిల్ జడ్జి
మండల పార్టీ నూతన కమిటీ ఖరారు
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
రేపు పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ
బస్వాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం.. పాడి రైతులకు వైద్య సేవలు