ఆదిలాబాద్ మార్కెట్ యార్డు ను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
1.jpeg)
ఆదిలాబాద్ బ్యూరో: కొనుగోళ్ల నేపథ్యంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్లు, కాంటాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు మార్కెట్‌కు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కొనుగోళ్ళ నేపత్యంలో, మార్కెట్‌కు వచ్చే రైతులకు భోజన వసతి, తాగునీటి సౌకర్యం, మహిళా రైతుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లతో పాటు హెల్ప్‌డెస్క్, డిజిటల్ డిస్‌ప్లే ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచామని, రైతులు పత్తి తేవడానికి ముందే తేమ శాతంపై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. కిన్వట్, మహోర్ ప్రాంతాల రైతుల కోసం ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నామని, తమకు కేటాయించిన మిల్లుల నిల్వ సామర్థ్యానికి అనుగుణంగానే పత్తి తేవాలని తెలిపారు. రోడ్డు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పత్తి రైతులు, వాహనదారులు రాంపూర్ రోడ్డు మీదుగా వ్యవసాయ మార్కెట్‌కు రావాలని, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పోలీస్ యంత్రాంగాన్ని సహకరించాలని. అలాగే రైతులకు చెల్లింపులు మూడు రోజుల్లో జమ అవ్వడానికి బ్యాంకు ఖాతాకు ఈ-కేవైసీ పూర్తి చేసి ఆధార్ లింక్ చేసుకోవాలని, పట్టా పాస్‌బుక్, స్లాట్ బుక్, ఫార్మర్ ఐడి సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


