ముస్తఫా నగర్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్&పాలకవర్గ సభ్యులు

ముస్తఫా నగర్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకున్న  కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్&పాలకవర్గ సభ్యులు

గంభీరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుండటంతో ఆదివారం గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో  కాంగ్రెస్ నాయకులు మరియు సర్పంచ్ &పాలకవర్గ సభ్యులు లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు  మాట్లాడుతూ, పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ప్రజా ప్రభుత్వ విజయమని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో దమ్మన్నపేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి,
సర్పంచ్ బండ సుకన్య దేవయ్య, పిఎసి వైస్ చైర్మన్ బలరాం రెడ్డి ,ఉప సర్పంచ్ శివంది దేవేందర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవేందర్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు శివంది శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ ప్రసాద్ రావు, శివంది వంశీ, వార్డు సభ్యులు కృష్ణ కాంత్ యాదవ్, తోపాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి