బెల్లంపల్లిలో బియ్యం విక్రయాల అవుట్‌లెట్ ప్రారంభం
బెల్లంపల్లి (మంచిర్యాల, జిల్లా) : ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం బెల్లంపల్లిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి ప్రారంభించారు. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ధరల నియంత్రణకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవుట్‌లెట్‌లో బియ్యం ధరలు (26 కిలోల బస్తా): బీపీటీ కొత్త బియ్యం – రూ.1,326 బీపీటీ పాత బియ్యం – రూ.1,612 హెచ్‌ఎంటీ స్టీమ్ బియ్యం – రూ.1,872 జై శ్రీరామ్ పాత బియ్యం – రూ.2,028 కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


