రామంతపూర్‌లో భారీ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
రామంతపూర్‌లో భారీ పేలుడు సంభవించింది. చర్చి కాలనీలోని ఓ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పేలుడు ధాటికి మంటలు చెలరేగడంతో బాధితుడు కాలిన గాయాలతో బయటకు వచ్చాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా వ్యాపించిన మంటలను శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Oct 2026 13:16:38
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై...
