గిరిజన యువత అభివృద్ధికి చదువే బలమైన ఆయుధం : కలెక్టర్ రాజర్షి షా 

WhatsApp Image 2026-10-11 at 5.59.49 AM

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్

ఆదిలాబాద్ బ్యూరో  :  గ్రామాల సమగ్ర అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని, గిరిజన యువత జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువే బలమైన ఆయుధమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బాలబాలికలు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారంఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కోసుపటేల్ గూడ గ్రామంలో ఇంద్రవెల్లి అమరవీరుడు పెందూర్ మచ్చు కుటుంబ సభ్యులైన దుర్గాబాయి–ఆనంద్ రావు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి, గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కోసుపటేల్ గూడలో గతంలో ఎల్-3గా ఉన్న లబ్ధిదారుల జాబితాను ఎల్-1కు మార్పు చేయించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, వీవోలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన నూతన భవనాల నిర్మాణాలతో పాటు పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు.

  • WhatsApp Image 2026-10-11 at 5.59.49 AM (1)
  •  
  • బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యమివ్వాలి

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులు బాలికలకు సంపూర్ణ మద్దతునిస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించగలరని పేర్కొన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గురుకులాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బాలికలను చిన్న వయసులోనే చదువుకు దూరం చేయడం, బాల్యవివాహాలు చేయడం సరికాదని, వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. దసరా సెలవుల అనంతరం విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలు, గురుకులాలకు హాజరు కావాలని, సెలవు రోజుల్లో సమయాన్ని వృథా చేయకుండా హోంవర్క్, ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించినప్పుడే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో బోర్ల తవ్వకాలపై ఆధారపడకుండా మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా బోర్ల వద్ద రీచార్జ్ నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, పెర్కొలేషన్ ట్యాంకులు ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించుకోవాలని వివరించారు. నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ శివరామ్, తహశీల్దార్ అరవింద్ కుమార్, ఎంపీడీవో రఘువీర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ డీఈ రమేష్, సర్పంచ్ గణపతి, నాయకులు ఆడే గజేందర్, స్థానిక సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..