- శివంపేటలో భారతీయ జనతా పార్టీలోకి భారీ చేరికలు

> గ్రామ స్తాయిలో పార్టీని బలోపేతం చేయటమే లక్షం : మోక్షం జిల్లా అధ్యక్షుడు చంటి ప్రభు
చౌటకూర్ (సంగారెడ్డి) : చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎస్సీ మోక్షం జిల్లా అధ్యక్షుడు చంటి ప్రభు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరిగితే ప్రభుత్వాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులు, యువత, మహిళలు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, రైతులకు అండగా నిలవడం, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని, అభివృద్ధి మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


