మద్యం మత్తులో వాహనాలు నడిపిన 578 మందిపై కేసులు:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగరంలో రహదారి భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 578 మంది పట్టుబడ్డారు. నవంబర్ 6, 7,8, తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 495 మంది ద్విచక్ర వాహనదారులు, 28 మంది త్రిచక్ర వాహనదారులు, 55 మంది నాలుగు చక్రాల వాహనాలు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు.
బీఏసీ స్థాయిల వారీగా కేసుల వివరాలు:
- 30–50 ఎంజీ: 115 కేసులు
- 51–100 ఎంజీ: 257 కేసులు
- 101–150 ఎంజీ: 111 కేసులు
- 151–200 ఎంజీ: 52 కేసులు
- 201–250 ఎంజీ: 27 కేసులు
- 251–300 ఎంజీ: 11 కేసులు
- 300 ఎంజీకి పైగా: 5 కేసులు
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సంయుక్త పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పిలుపు: మద్యం తాగి వాహనం నడపవద్దు.. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలనూ కాపాడండి!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


