పోలీసుల విధి నిర్వహణపై చిన్నారులకు అవగాహన
చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్
చిలిపిచేడ్ మెదక్ జిల్లా :
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పనితీరు, పోలీసుల విధులపై అవగాహన కల్పించేందుకు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బుధవారం నాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నర్సింలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, కేసుల నమోదు,దర్యాప్తు ప్రక్రియ,శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి వివరించారు. ప్రజల రక్షణ,నేరాల నియంత్రణలో పోలీసులు నిర్వహించే బాధ్యతలను తెలియజేశారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సింలు,హెడ్ కానిస్టేబుల్ ఎలియాస్ రెడ్డి,కానిస్టేబుల్ చైతన్య కుమార్,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


