*శాంతాపూర్‌లో ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్

*శాంతాపూర్‌లో ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్

*ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నరేష్ జాదవ్ ఈరోజు శాంతాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాంతాపూర్ గ్రామానికి చెందిన సాబ్లె భరత్ రెండు రోజుల క్రితం పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. అలాగే, అదే గ్రామానికి చెందిన బస్సీ గులాబ్ సింగ్ గుండెపోటుతో మృతి చెందారు. వీరిద్దరి అంత్యక్రియలను ఈరోజు శాంతాపూర్ గ్రామంలో నిర్వహించారు. విషయం తెలుసుకున్న నరేష్ జాదవ్ గ్రామానికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొని మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం సాబ్లె భరత్, బస్సీ గులాబ్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇద్దరి మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, మాజీ మండల అధ్యక్షులు అంకత్ రవి, గోండ్ హార్కపూర్ సర్పంచ్ జాదవ్ నిశాంత్,రాదేశ్యం, బండారి సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్