ఘనంగా 76వ ఐఎఫ్ డబ్ల్యూజే వ్యవస్థాపక వేడుకలు
టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు మహిపాల్ రెడ్డి కార్యదర్శి ఖుద్రత్ అలీ
హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ పరిధిలోని రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హల్లో 76వ ఐఎఫ్ డబ్ల్యూజె యూనియన్ ఆవిర్బవ దినోత్సవ వేడుకలను,సిద్దిపేట జిల్లా
ఐఎఫ్ డబ్ల్యూజే
అనుబంధం సంస్థ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు సత్తు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖుద్రత్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యూనియన్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.సీనియర్ పాత్రికేయులకు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మహిపాల్ రెడ్డి కార్యదర్శి ఖుద్రత్ అలీ మాట్లాడుతూ 1950 అక్టోబర్ 28న ఢిల్లీలో ఎంతోమంది సీనియర్ పాత్రికేయులు స్థాపించిన తొలి పాత్రికేయుల యూనియన్ అయిన ఐఎఫ్ డబ్ల్యూజే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించి జర్నలిస్టు హక్కుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నీవేశాన స్థలాలతొ పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరిచేయాలని, 60 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనేక చోట్ల జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అనంతరం దుబ్బాక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రాజు,యాదగిరి,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎండీ షాదుల్,సదానందం,ఉమర్, కత్తెర నవీన్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

