ప్రభుత్వ, పంచాయతీ భూముల హద్దులను గుర్తించాలి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టాలని తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి

ప్రభుత్వ, పంచాయతీ భూముల హద్దులను గుర్తించాలి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టాలని తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి

చౌటకూర్ : గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ, గ్రామ పంచాయతీ స్థలాల హద్దులను అధికారికంగా గుర్తించాలని కోరుతూ చౌటకూర్ గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.గ్రామంలోని సర్వే నంబర్లు 21, 22, 36, 1503, 1632 పరిధిలోని భూములకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించి, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని వారు కోరారు. ఆయా సర్వే నంబర్లలో ఉన్న భూముల విస్తీర్ణం, సరిహద్దులు, ప్రస్తుత స్థితిగతులు మరియు వినియోగాన్ని స్పష్టంగా నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులను సమన్వయం చేసుకుంటూ పక్కాగా సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూముల వివరాలను అధికారికంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు, ఆక్రమణలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వెంటనే సర్వే పూర్తి చేసి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్కుల రాంరెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి, అభిలాష్, మంగలి బాలు, మల్లేశం, ఆకుల బాలు తదితరులు పాల్గొన్నారు.

Views: 159

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం