పదవి విరమణ పొందిన ఉపాధ్యాయురాలకు ఘన సన్మానం
జన్నారం : పదవి విరమణ పొందిన ఉపాధ్యా యురాలు దమ్ము ఇందిరా రాజన్నను పలువురు అధి కారులు ఘనంగా సన్మానిం చారు. లక్షటిపేటలోని ప్రభు త్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా 31 సంవత్సరాలు సేవలు అం దించి గత నెలలో పదవి విరమణ పొందిన దమ్ము ఇందిర రాజన్నకు జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామంలో గ్రామానికి చెందిన పలువురు అధికారులు స న్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా స న్మానించారు.ఈ కార్యక్రమం లో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్య క్షులు దాముక కమలాకర్, నిర్మల్ జిల్లా డివిజనల్ స్థా యి పంచాయతీ అధికారి రామలింగయ్య, తాళ్లగు రజాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దేవిరాజం, రేం డ్లగూడ మాజీ ఎంపీటీసీ దాముక కరుణాకర్ మమ త,మాజీ ఉపసర్పంచ్ ప్ర స్తుత వార్డు సభ్యులు దా ముక రాజరత్నం, మాజీ సిడిపిఓ లక్ష్మీకళావతి, భీం పూర్ మండల ఎంపిడిఓ కార్యాలయ సూపరిండెం ట్ సరళ గ్రామ పెద్దలు దా ముక జాన్, సంజీవరావు, అర్జున్, సుధాకర్ తదితరు లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


