హుస్నాబాద్ పందిల్ల ప్రధాన రహదారిపై భారీ యాక్సిడెంట్ తండ్రి కూతురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బ్రిడ్జి దాటిన తర్వాత పందిల్ల గ్రామ శివారులో పోచమ్మ దేవాలయం వద్ద సిద్దిపేట -హుస్నాబాద్ నేషనల్ హైవేపై ప్రధాన రహదారిపై హైదరాబాద్ నుంచి చిగురుమామిడి మండలం కొండాపూర్ వెళ్తున్న కారును హుస్నాబాద్ నుండి వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది.ఈ సందర్బంగా ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి పైడిపల్లి శ్రీకాంత్ వయసు 35 సంవత్సరాలు కూతురు మహిరి వయసు ఐదు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు.తీవ్రంగా గాయపడిన ముగ్గురు భార్య కుమారుడు మరియు మరొకరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే పందిల్ల గ్రామ సర్పంచ్ తోడోటి రమేష్, సీఐ శ్రీధర్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే తీవ్ర గాయాల పాలైన శతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కారులో ప్రయాణిస్తున్న వారు కొండాపూర్ గ్రామానికి చెందిన వారుగా తెలిసింది. దీపావళి పండుగ రోజున ప్రమాదం జరగడంతో హుస్నాబాద్,పందిల్ల, కొండాపూర్ పరిధిలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


