అంబర్‌పేట 6 నంబర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్

25 గ్రాముల ఎండీఎంఏ, ఐదు సెల్‌ఫోన్లు, మూడు వాహనాలు స్వాధీనం

అంబర్‌పేట 6 నంబర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్ : అంబర్‌పేటలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అంబర్‌పేట 6వ నంబర్ జంక్షన్ సమీపంలో ఎండీఎంఏ (MDMA) విక్రయిస్తున్న ఐదుగురిని అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 గ్రాముల ఎండీఎంఏ, ఐదు సెల్‌ఫోన్లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.6.40 లక్షలుగా అంచనా వేశారు. పోలీసుల విచారణలో నిందితులు గ్రాము ఎండీఎంఏను రూ.5 వేల చొప్పున కొనుగోలు చేసి, రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!