హాస్పటల్లో పనిచేసిన మహిళ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనం చెల్లింపు
బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కూకట్ పల్లి నియోజకవర్గం లోని హౌసింగ్ బోర్డ్ లో విశిష్ట హాస్పిటల్ లో గత ఏడు నెలలుగా పని చేసిన వేతనం కోసం మహిళా కార్మికులు ఎంతో ఇబ్బందులు పడ్డారు విశిష్ట హాస్పటల్ యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ మహిళా కార్మికులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న వేతనం నాలుగు 4,లక్షల 19000/- వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అవి ఇవ్వకపోవడంతో ఎవరైతే మనకు కార్మికుల పట్ల న్యాయం జరుగుతుందని తెలుసుకొని తోటి కార్మిక మిత్రుల ద్వారా బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని, అతని కార్యాలయం వద్దకు వెళ్లి ఆ మహిళ కార్మికులకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.వెంటనే స్పందించిన రవి విశిష్ట హాస్పటల్ యజమాన్యం తో మాట్లాడి మహిళా కార్మికులు మొత్తం ఒక్కొక్కరికి రావాల్సిన వేతనం, జితేంద్ర ప్రసాద్ 60,000, వీరస్వామి 90,000, సాకేత్ 13000, శ్రావ్య 17000, సమత 15000, మనుష 8000, సుకన్య 40,000, నాగరాణి 55000, రేవతి 16000, జ్యోతి 18000, భాగ్యలక్ష్మి 17000, ఝాన్సీ 70,000, వేల రూపాయలు మొత్తం 4 లక్షల19000/- వేల రూపాయలు మొత్తం 12 మంది మహిళ కార్మికులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. మహిళా కార్మికులు మాట్లాడుతూ కార్మికుల కష్టజీతం ఇప్పించడంతో సహాయం చేసిన కార్మిక నాయకుడు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, జగన్, సుదర్శన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


