భారతదేశంలో 16ఏళ్ల తర్వాత తొలిసారిగా జరగనున్న జనగణన ప్రక్రియ...

- స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా జరుగనున్న కుల గణన..    

9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a

హైదరాబాద్ : జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి విడత (గృహాల జాబితా మరియు గృహ గణన) ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు, రెండో విడత (జనాభా గణన) ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో స్మార్ట్ ఫోన్ ల ద్వారా జరగనుంది. ఇందులో కుల గణన కూడా మొదటిసారి చేర్చబడింది.  ఇందులో ఇంటి నిర్మాణ సామగ్రి, సౌకర్యాలు (నీరు, వెలుగు, వంట, స్నానం, మరుగుదొడ్డి), ఫోన్, ఇంటర్నెట్ వంటి వస్తువుల యాజమాన్యం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించబడతాయి.  కాగా  రెండవ విడత (ఫిబ్రవరి 2027) న ప్రారంభం కానుంది.  జనాభా గణన (Population Enumeration - PE) జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో సెప్టెంబర్ 2026లో జరుగుతుంది.  డిజిటల్ పద్ధతి లో ఎన్యూమరేటర్లు, స్మార్ట్ ఫోన్ యాప్ ల ద్వారా డేటాను సేకరిస్తారు, ఇది మొదటిసారి. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో కుల గణనను ఈ జనగణనలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు.  ఈ గణన 2011 తర్వాత మల్లి ఇపుడు జరుగుతుంది. గతంలో  కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. 

*ముఖ్య ఘట్టాలు:*

 జూన్ 2025లో కేంద్ర ప్రభుత్వం జనగణన నోటిఫికేషన్ విడుదల చేసింది. • డిసెంబర్ 2025 నాటికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు దశల షెడ్యూల్ను లోక్సభకు తెలియజేసింది. ఈ ప్రక్రియ కోసం క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం వంటి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News