శ్రీశైల దేవస్థానం (8) నుండి (16) తేదీ వరకూ ఉచిత బస్సు సదుపాయం

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. ఈ బస్సులు కైలాసద్వారం నుండి శ్రీశైలం వరకు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్,విభూతిమఠంజంక్షన్,మల్లమ్మకన్నీరు,శివాజీస్ఫూర్తికేంద్రం,రుద్రాపార్కు,సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా మరల నందిగుడి సర్కిల్‌కు చేరుకుంటాయి. కాగా భక్తులరద్దీని (8) na నాలుగు బస్సులు నడపబడుతున్నాయి. (9) వరకు కూడా నాలుగు బస్సులను నడపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 10 మరియు 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు నడపబడుతాయి. అలాగే 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులను నడపడం జరుగుతుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

