విద్యుదాఘాతంతో మహిళ మృతి
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): బాత్రూం వద్ద ఉన్న విద్యుత్ తీగను అనుకోకుండా తాకడంతో విద్యుత్ షాక్ గురై మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఇదే గ్రామానికి చెందిన బర్తిపాక లక్ష్మీ (37) ఆశ వర్కర్ గా పని చేస్తూ ఇటీవల తన అన్న ఇంటిలో నివసిస్తుంది. ఈ క్రమంలో స్నానం చేసి బాత్రూం వద్ద ఉన్న విద్యుత్ తీగను అనుకోకుండా తాకడంతో విద్యుత్ షాక్ కి గురై అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి అన్న గద్దె మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి ప్రసన్న కుమార్ తెలిపారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
