ప్రజా సేవకుడు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

ప్రజా సేవకుడు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

  • తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.
  • ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు.
  • జిల్లా ఆసుపత్రి, ఎం సి హెచ్ అల్పాహారం పంపిణీ.

తాండూరు (వికారాబాద్ ) ప్రజా సేవకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి అన్నారు. ఆగస్టు 5న స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరాజ బాల్రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మ అందులో భాగంగా మూడో రోజు సోమవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా నాయకుడు ప్రజల సేవకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని అన్నారు. ఆగస్టు 5న జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
 
Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి