పీజీ సెట్ లో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన అశ్వినికి ఘన సన్మానం
దోమ(వికారాబాద్ ): వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధర్పల్లి నర్సింలు కుమార్తె ధర్పల్లి అశ్విని తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCPGET-2026) లో ఎంఎస్సీ ఫిజిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా శివారెడ్డిపల్లి గ్రామ పెద్దల సమక్షంలో అశ్వినిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఆమె సాధించిన ఈ విజయం గ్రామానికి గర్వకారణమని, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. అశ్విని కృషి, పట్టుదలతో ఈ ఘనతను సాధించడం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, యువత, గ్రామస్తులు పాల్గొని అశ్వినికి శుభాకాంక్షలు తెలిపారు.
Views: 42
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
