ఇందిరమ్మ ప్లాట్ల విక్రయ ఆరోపణలను ఖండించిన వట్టెం సర్పంచ్ భర్త పిట్టల శంకర్
నాగర్ కర్నూల్ / బిజినపల్లి కొన్ని రోజులుగా పేదవారికి ఇచ్చిన ఇందిరమ్మ ప్లాట్లు వట్టెం సర్పంచ్ భర్త పిట్టల శంకర్ మధ్యవర్తిగా ఉంటూ ఆ ప్లాట్లను అమ్మించాడంటూ తనపై వస్తున్న ఆరోపణ నిజం కాదని అన్నారు. గ్రామంలోని కొందరు వ్యక్తులు తనపై కక్ష పూరితంగా అనవసర ఆరోపణలు చేస్తున్నారని అలాంటి ఆరోపణలు తనకు సంబంధం లేదని పిట్టల శంకర్ వివరణ ఇచ్చారు.ప్లాటు యాజమాన్యులు తమ ప్లాటును అమ్ముకుంటామని తన దగ్గరికి వచ్చారనీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్లాట్లు నిరుపేదలకే ఉండాలని, అమ్మే అవకాశం లేదని వారితో చెప్పానని తెలిపారు.పేదకుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను,అలాంటి నేను పేదలకు అన్యాయం ఎలా చేస్తాను అని వివరణ ఇచ్చారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
