డాక్టర్‌ రమేష్‌ పై సస్పెన్షన్‌ వేటు...

విజన్ ఆంధ్ర వార్త కథనానికి  స్పందన

డాక్టర్‌ రమేష్‌ పై సస్పెన్షన్‌ వేటు...

ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ 

సంగారెడ్డి  : జోగిపేట ఏరియా అసుపత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ (జనరల్‌ మెడిసిన్‌)గా పనిచేస్తున్న డాక్ట

87acb671-9a14-4e83-8c42-699761d76f8b

ర్‌ రమేష్‌పై వేటు పడింది. ఈ నెల 5వ తేదీన జోగిపేట ఏరియా అసుపత్రిలో ఆయనకు బదులుగా మరో వ్యక్తి చేత విధులను నిర్వర్తింపజేశాడు. ఈ విషయాన్ని విజన్ ఆంధ్ర శుక్రవారం ‘ఏరియా అసుపత్రిలో ప్రైవేటు డాక్టర్‌’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై విచారణ చేపట్టిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిజమేనని తెలడంతో డాక్టర్‌ రమేష్‌పై సస్పెన్షన్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. రమేష్‌కు బదులు విధులను WhatsApp Image 2026-08-07 at 12.04.27 PMనిర్వర్తించిన వ్యక్తి రవిగా గుర్తించారు. ఇతను సదాశివపేటలోని డెంటల్‌ క్లినిక్‌ నడుపుతున్నట్లు తెలిసింది. 

ఆరోగ్య మంత్రి దామోదర్‌ సిరియస్‌:
జోగిపేట ఏరియా అసుపత్రిలో ఒకరికి బదులుగా మరో ప్రైవేటు వ్యక్తిచేత వైద్య సేవలను అందించడంపై మంత్రి దామోదర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంపై సమగ్ర విచారణను చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకొవాలని ఆరోగ్య శాఖ ముఖ్య   కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తును ఆదేశించారు. విచారణలో వాస్తవాలు బయటకు రావడంతో డాక్టర్‌ రమేష్‌పై సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై జిల్లా వైద్య అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హె చ్చరించారు.

Views: 56

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News