చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి

రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్

చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి

విజేత, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పెద్ద శంకరంపేటలో చేనేత కార్మికులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి కనక రాజు అధ్యక్షతన మార్కండేయ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తిమీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో నేతన్న ల ఆకలి చావులు లేకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు  పద్మశాలి కార్పొరేషన్ ద్వారా చేనేత వృత్తుల వారితోపాటు పద్మశాలీలలో ఇతర వృత్తులు చేసుకుంటున్నవారికి సైతం ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25వేల రూపాయలు దాదాపు 71 వేల 1903 మందికి అందించారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు పద్మశాలీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు. పెద్ద శంకరంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి కనకరాజు. చేనేత సహకార సంఘం అధ్యక్షులు మహంకాళి కృష్ణమూర్తి.నీలి కుల సంఘం అధ్యక్షుడు దొడ్లే దశవంత్,నీల కంటి కులం అధ్యక్షుడు విట్టల్,  పట్టణ అధ్యక్షులు జంగం రాములు గుజ్జరి సంగమేశ్వర్. అనిల్ డాక్టర్. ఉపేందర్ జంగం రాఘవులు. సిహెచ్ నవీన్ . నంశం గారి సంతోష్ కుమార్. కోటగిరి రమేష్. పడాల రవి. ఆయా గ్రామాల నుండి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం