రాయికల్ లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహణ
రాయికల్(జగిత్యాల) : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మార్కండేయ మందిరం ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ పెద్దలు కులదైవం మార్కండేయ మహర్షి,చేనేత ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేనేత రంగ అభివృద్ధికి సేవలందించిన పెద్దలు,చేనేత కార్మికులను శాలువాలు, పూలదండలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు.చేనేత వృత్తి పరిరక్షణకు సమాజం అండగా నిలవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం, మున్సిపల్చైర్మన్ కట్కం రవీందర్, నాయకులు మోర హన్మాండ్లు, సామల్ల సతీష్,కడకుంట్ల నరేష్, దాసరి గంగాధర్,అడేపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
