ప్లాస్టిక్ రహిత పట్టణంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్

ప్లాస్టిక్ రహిత పట్టణంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్

  • కిరాణా వర్తకులు, వ్యాపారులతో విస్తృత అవగాహన సమావేశం
  • పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు వినియోగించాలి
  • మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్

గజ్వేల్/సిద్దిపేట :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కిరాణా వర్తక సంఘం ప్రతినిధులు, వివిధ వ్యాపారులతో మున్సిపల్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల విచ్చలవిడి వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, కాగితపు సంచులు వంటి పర్యావరణ హిత వస్తువులనే వినియోగించాలని వ్యాపారులకు సూచించారు. పరిశుభ్రమైన, హరిత గజ్వేల్ నిర్మాణంలో వ్యాపారులు భాగస్వాములై, గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు నిరంతరం తనిఖీలు చేపట్టడంతో పాటు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వ్యాపార సముదాయాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం సభ్యులు, వ్యాపారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 
Views: 56

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం