కాలుష్య కోరల్లో మంజీరా నది.
అధికారుల నిర్లక్ష్యంపై శివంపేట గ్రామస్థుల ఆగ్రహం
చౌటకూర్ : ఉమ్మడి మెదక్ జిల్లాకు జీవనాడిగా, సుమారు 1,800 గ్రామాలకు తాగునీటి వనరుగా ఉన్న మంజీరా నది రోజురోజు కూ కాలుష్య కోరల్లో చిక్కుకుంటోందని శివంపేట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థ జలాలు మంజీరాలో కలుస్తుండటంతో నది నీటి నాణ్యత దెబ్బతింటోందని ఆరోపించారు. గ్రామస్థుల కథనం ప్రకారం, చౌటకూర్ మండలం శివంపేట శివారులోని ఓ బీరు పరిశ్రమ వర్షపు నీటి మాటున శుద్ధి చేయని వ్యర్థ జలాలను మోటార్ల ద్వారా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని తాము ప్రత్యక్షంగా గుర్తించి సంబంధిత అధికారుల కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వాపోయారు. కాలుష్య జలాల కారణంగా నది నీటి రంగు, వాసన, రుచి మారిపోయాయని, సాగునీరు కలుషితమవడంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కలుషిత నీటి ప్రభావంతో చేపలు, పశువులు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు.కాలుష్య నియంత్రణ మండలిఅధికారులు వచ్చి నీటి నమూనాలు సేకరించి వెళ్లిపోతున్నారే తప్ప, కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. అవసరమైతే తామే ప్రైవేట్ ల్యాబ్‌లో నమూనాలను పరీక్షించేందుకు సిద్ధమని తెలిపారు.మంజీరా నదిలో శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థ జలాల విడుదలను వెంటనే నిలిపివేసి, సంబంధిత పరిశ్రమలపై పర్యావరణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమర్థవంతంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:22:56
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
