కొమురవెల్లి,(సిద్దిపేట): గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆచూకీ తెలిసినవారు కొమురవెల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించగలరు
కొమురవెల్లి మండల పరిధిలోని లెనిన్ నగర్ శివారు ప్రాంతంలో శుక్రవారం గురువారం రోజున రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి గాయపడగా, చికిత్స నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాలు, ఎత్తు సుమారు 6 అడుగులు, సన్నని శరీరాకృతి, నల్లని ఛాయ, పొట్టి వంకర జుట్టు కలిగి ఉన్నాడు. ప్రమాద సమయంలో ఎరుపు రంగు హుడి మరియు ఆలివ్ గ్రీన్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సదరు వ్యక్తి పేరు, చిరునామా మరియు ఇతర కుటుంబ వివరాలు తెలియరాలేదు.కావున, పై వివరాలు మరియు ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా వారి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలిసినట్లయితే వెంటనే కొమురవెల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించగలరు. సమాచారం అందించవలసిన ఫోన్ నంబర్: 8712667358 అత్యవసర సహాయం: 112 మృతుడి గుర్తింపు తెలియజేయడంలో ప్రజలు సహకరించి, ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగ పోలీసులు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


