నషా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత మత్తు వైపు కాకుండా వ్యాయామం, క్రీడలు, పుస్తకాల వైపు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాశ్చాత్య దేశాలు భారత్ లోని యువతను "డ్రగ్ టెర్రరిజం" వైపు మరల్చాలని చూస్తోందన్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన బృహత్తర కార్యక్రమం నిజంగా స్పూర్తిదాయకమన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


