రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను సన్మానించిన ఎస్ఐ వెంకట్ రెడ్డి
నాగర్‌కర్నూల్ : తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు నాగర్‌కర్నూల్ లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఎంపికయ్యారు.జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు :
- అండర్-12 విభాగం, 150 మీటర్ల పరుగు - రాధిక
- అండర్-12 విభాగం, 150 మీటర్ల పరుగు - దర్శి
- అండర్-16 విభాగం, 1000 మీటర్ల పరుగు - గణేష్
- అండర్-16 విభాగం, 400 మీటర్ల పరుగు - జ్ఞానేశ్వర్
- అండర్-20 విభాగం, 400 మీటర్ల పరుగు - అజయ్
- అండర్-20 విభాగం, 80 మీటర్ల పరుగు - నవీన్
రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను నాగర్‌కర్నూల్ ఎస్ఐ వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదలతో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించవచ్చని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాగర్‌కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని కోచ్ రాణా మల్లేష్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీస్తూ యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌పై పలువురు అభినందనలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

