శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా సహస్ర మృత్తికా లింగార్చన

లోకకల్యాణార్థం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు

శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా సహస్ర మృత్తికా లింగార్చన

బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా)  : బెల్లంపల్లిమండలంలోని కన్నాల గ్రామంలో కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 27) రాత్రి వరకు ఆరుద్ర నక్షత్ర యుక్త సంకష్టహర చతుర్థి సందర్భంగా సహస్ర మృత్తికా లింగార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణార్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి గర్రెపల్లి వేణుగోపాల్ గుప్తా పర్యవేక్షణలో, అర్చకుడు సతీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్థివ లింగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు, లింగార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పార్థివ లింగార్చనలో భక్తితో పాల్గొన్నారు. అనంతరం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసంలో నిర్వహించిన ఈ ప్రత్యేక లింగార్చనతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి