సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిని స్మరించుకున్న బిసి సంఘం
పూలే, అంబేద్కర్ చౌరస్తాలో మండల బిసి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
బిజినపల్లి జిల్లా:- సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఉదయం బిజినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల బిసి సంఘం ఆధ్వర్యంలో బిజినపల్లి పూలే, అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. అణగారిన వర్గాలకు విద్యను అందించి, మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయుడు పూలే అని తెలిపారు. పూలే చూపిన మార్గంలో నడిచి సమాజంలో సమానత్వం సాధించాలని పిలుపునిచ్చారు.పూలే ఆశయాలను నేటి తరం యువతకు తెలియజేయాలని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులు సూచించారు. బిసి వర్గాల ఐక్యతతోనే హక్కులు సాధించుకోగలమని అన్నారు.ఈ కార్యక్రమంలో అంతటి రాజేందర్ గౌడ్, వేముల సత్యశీలసాగర్, చిర్ణం బాలస్వామి యాదవ్, గంగనామొని రాములు, ఊర్కొండ రఘుబాబు, నాయినోల నరేందర్ గౌడ్, కల్మురి చిన్నయ్య సాగర్, శసాని శ్రీధర్, ఉప్పనామొని శ్రీనివాస్, సంగిశెట్టి ఆంజనేయులు, పాపని నరేందర్, నక్క పర్వతాలు యాదవ్, మ్యాదరి మల్లేష్, అతినారపు బాల్ లక్షుమయ్య, పల్లె సత్యం, వడ్ల రాఘవేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


