రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళ మృతి
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : బెల్లంపల్లి మండల పరిధిలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలోనీ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. భీమారం మండలం మద్దికల్ గ్రామానికి చెందిన దేనవేణి మల్లక్క (60) కంటి పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న మల్లక్కను ఐబీ వైపు నుంచి మంచిర్యాల వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి డివైడర్‌పై పడటంతో , ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు వాహనాన్ని ఘటనాస్థలంలోనే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఆమె ప్రమాదం జరిగిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.. తాళ్లగురజాల ఎస్సై ప్రశాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించి. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


