ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎

‎​కోయిలకొండ మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి ‎ ‎​సమస్యలపై సర్పంచులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన ‎

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎

‎​కోయిలకొండ, : ‎ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నారాయణపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కోయిలకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటోందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తక్షణమే స్పందించి ఆదుకునేలా సర్పంచులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.​అంతకుముందు వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతి నివేదికలను సభలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో కోయిలకొండ ఎంపీడీవో ధనుంజయ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి