మానవత్వం చాటిన మంగపేట ఫోటోగ్రాఫర్లు
అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్‌కు అసోసియేషన్ అండ
మంగపేట : రిపోర్టర్ మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఇర్సవడ్ల సుదర్శన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రోజు విడిచి రోజు వరంగల్‌లోని అజరా ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న మంగపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు వడ్లకొండ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన్‌కు రూ. 8 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.కష్టాల్లో ఉన్న సభ్యులను సంఘం తరఫున ఎల్లప్పుడూ ఆదుకుంటామని అధ్యక్షుడు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కపెల్లి రాజేష్, ఆర్గనైజర్ పూజరి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు అక్కపెల్లి నరేష్, గౌరవ సలహాదారులు వడ్లకొండ వీరయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇప్పాల నరేష్, కోశాధికారి ఉగ్గుమల్ల గణేష్, ఉపాధ్యక్షుడు పసుపులేటి రాజశేఖర్, బండి రాకేష్, ఎస్.రవి, మాటూరి సాయి కుమార్, జాడి యుగేందర్, దిడ్డి శ్రీనివాస్, గూడురు ప్రవీణ్, కోర్స రాకేష్, వడ్లకొండ పూర్ణ చందర్, ఎన్ఆర్ నాని తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


